Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన హీరోగా ఇప్పటికీ హీరోలకు పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ బ్లడ్, ఐ బ్యాంక్ వంటి ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.

అయితే తాను సినిమాలలో ఉన్నప్పుడే ఇంత సేవ చేస్తే రాజకీయాల్లోకి వస్తే మరింత సేవ చేయొచ్చు అన్న ఒకే ఒక కారణంతోనే ఈయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు 9 సంవత్సరాల పాటు రాజకీయాలలో కొనసాగినటువంటి ఈయన రాజకీయాలలో ఇమడలేక రాజకీయాల నుంచి దూరమయ్యారు.
ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నటువంటి చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే తాజాగా సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో ఈయన పాల్గొంటూ రాజకీయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను తొందరపడి రాజకీయాలలోకి అడుగు పెట్టానని అయితే నేటి రాజకీయాలకు తాను అనర్హుడిని అని తెలిసి బయటకు వచ్చానని తెలిపారు.
ఓపిక ఉన్నంతవరకు సినిమాలలోనే..
ఇలా బయటకు వచ్చిన తర్వాత సినిమాలలో తిరిగి నన్ను ఆదరిస్తారా అన్న అనుమానం ఉండేది కానీ ప్రేక్షకులు నా పట్ల అదే ఆధారాభిమానాలు చూపిస్తున్నారని ఈయన తెలియజేశారు. అందుకే ఇకపై రాజకీయాలలోకి వెళ్లకుండా నా ఓపిక ఉన్నంతవరకు సినిమాలలోనే కొనసాగుతానని చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























