ఒకప్పుడు తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం మెగస్టార్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు. దానిని 1999లో అతడి దర్శకత్వంలోనే ‘స్నేహం కోసం’ అనే తెలుగు టైటిల్ తో విడుదల అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిరంజీవికి ఆప్తమిత్రుడిగా ప్రముఖ నటుడు విజయకుమార్ నటించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే అందులో చిరంజీవి స్నేహితుడిగా విజయ కుమార్ చేసిన పాత్రకి ముందుగా సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారట.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమా షూటింగ్‌కి ముందు వీరిద్దరూ ఇందులో కలిసి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి. ఎందుకుంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకనే అలా ఆలోచించారట. ఇదంతా అనుకుంటుడగానే.. చిరంజీవి ఎందుకో సూపర్ స్టార్ ను సంప్రదించలేదట. తర్వాత ఆ పాత్రను రాజశేఖర్ ను అనుకొని అతడిని సంప్రదించారు మూవీ మేకర్స్.
ఇక రాజశేఖర్ ఆ పాత్రకు ఓకె అయిన సమయంలో చిరంజీవి వెళ్లి.. ఆ పాత్ర చేయకపోవడమే మంచిది.. ఈ సమయంలో ఓల్డ్ రోల్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో విరమించుకోవాల్సి వచ్చిందట. చివరకు ఆ పాత్రకు తమిళంలో నటించిన విజయ్ కుమారే చేయాల్సి వచ్చిందట.































