Chiranjeevi -Surekha: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇలా ఇప్పటికీ చిరంజీవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా చిరంజీవి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన అల్లు అరవింద్ కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం 1980 ఫిబ్రవరి 20వ తేదీ మద్రాసులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక వీరి వివాహం జరిగి 2023 ఫిబ్రవరి 20 తేదీకి 44 సంవత్సరాలు కావడంతో వీరి పెళ్లినాటి పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ పెళ్లి పత్రిక వైరల్ అవ్వడంతో చిరంజీవి సురేఖ దంపతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి 44 సంవత్సరాలు కావడంతో ఎంతో మంది వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలో చిన్న చిన్న గొడవలకి విడిపోవడం జరుగుతుంది. అయితే ఒకానొక సమయంలో వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్న చిరంజీవిని సురేఖ ఎంతో అర్థం చేసుకున్నారు.ఇలా వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా అన్యోన్యంగా కొనసాగిందని చెప్పాలి.

Chiranjeevi -Surekha: అన్యోన్యంగా సాగిన జీవితం….
ఇక ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా పేరు సంపాదించుకొని తండ్రికి మించిన తనయుడు అనే పేరు పొందారు ఇక పెద్ద కుమార్తె సుస్మిత ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ఇక శ్రీజ మెగాస్టార్ చిన్న కుమార్తె గురించి కూడా మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి సురేఖ పెళ్లి రోజు కావడంతో ఎంతో మంది వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి-సురేఖల పెళ్లి పత్రిక.. pic.twitter.com/KTqsopzJ75
— Hardin (@hardintessa143) February 20, 2023
Wishing #Chiranjeevi garu #Surekha garu Happy Wedding Anniversary ❤❤@KChiruTweets #SurekhaKonidala
May God Bless You Both Forever ????❤#SurekhaAmma #MegaStarChiranjeevi pic.twitter.com/Hrv3ZdeYpc
— Chiranjeevi Army (@chiranjeeviarmy) February 20, 2023































