Chiranjeevi:టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మెగా సామ్రాజ్యాన్ని సృష్టించారు.ఇలా మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి ఆదరణ లభించింది ఇక చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన తమ్ముళ్ళను కూడా ఇండస్ట్రీలోకి తీసుకోవచ్చారు.

ఈ క్రమంలోనే తన అన్నయ్య బాటలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ అయినప్పటికీ నాగబాబు మాత్రం సక్సెస్ కాలేకపోయారు.నాగబాబు ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా సహాయ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇలా వీరి కెరియర్ గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయానికి వస్తే చిరంజీవి అల్లు అరవింద్ సోదరి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు.
ఇక నాగబాబు మాత్రం పద్మజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే పద్మజ మెగా ఇంటి కోడలుగా ఎలా అడుగు పెట్టారు ఏంటి అనే విషయానికి వస్తే.. అంజనాదేవి కుటుంబ సభ్యులతో కలిసి పాలకొల్లులో తమ సమీప బంధువుల పెళ్లి జరుగుతుండగా వెళ్లారట అక్కడ పద్మజను మొదటిసారి చూసినప్పుడు ఈమె నా రెండవ కోడలు అయితే బాగుంటుందని భావించారట. ఈ క్రమంలోనే వెంటనే తన వివరాలన్నింటినీ అంజనా దేవి సేకరించారు.

Chiranjeevi: చిరంజీవికి అభిమాని..
ఈ విధంగా పద్మజ వివరాలన్నింటిని సేకరించిన అంజనాదేవి తన తల్లిదండ్రులతో మాట్లాడి నాగబాబుతో తనకు వివాహం నిశ్చయం చేశారు. ఈ విధంగా వీరిద్దరి వివాహం జరగడం పద్మజ మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టడం జరిగింది. ఈ విధంగా పద్మజా పెళ్లి కాకముందే చిరంజీవి గారికి తనకు ఒక రిలేషన్ ఉంది. పద్మజ చిరంజీవి గారికి పెద్ద అభిమాని అట.పేపర్లో చిరంజీవి ఫోటో కనిపిస్తే చాలు దానిని కట్ చేసి ఈమె ఒక ఆల్బమ్ తయారు చేశారు. ఇలా ఆల్బమ్ చూసి అంజనాదేవి ఎంతో ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఇలా ఈమె మెగా ఇంటి కోడలు కాకముందే చిరంజీవికి పెద్ద అభిమాని. ఈ విధంగా తమ అభిమాన హీరోకి మరదలిగా పద్మజ ఆ ఇంటి అడుగు పెట్టడం విశేషం.































