Indra Movie: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఈయన హీరోగా ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలు అలాగే రాజకీయ నేపథ్యమున్న సినిమాలు కూడా చేశారు. ఇక యాక్షన్ సినిమాలలో కూడా చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలను తమ ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇలా ఈ బ్యానర్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాలలో ఇంద్ర సినిమా ఒకటి. అప్పటివరకు యాక్షన్ సినిమాలు చిరంజీవికి సూట్ అవ్వవు అని అందరూ భావించారు కానీ డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన మొదటి యాక్షన్ సినిమా ఇంద్ర. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అదే రోజు ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మూడు నంది అవార్డులు..
ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సిమ్రాన్ అనుకున్నారట కానీ ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్ నటించారు. అప్పట్లోనే ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 120 రోజులలోనే షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని ఏకంగా 268 స్క్రీన్ లలో విడుదల చేశారు. ఏడుకోట్లతో పూర్తి అయిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులను కూడా అందుకోవటం విశేషం.
































