కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్ అన్నిటికి హాలిడేస్ ఇచ్చి… టాలీవుడ్ సెలెబ్రేటిస్ అందరు ఇంటికే పరిమితమయ్యారు… ఈ క్రమంలో టాలీవుడ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది “బి ది రియల్ మెన్”. మొన్న ఎన్టీఆర్ విసిరినా ఛాలెంజ్ ని స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు (గురువారం) తాను చేసిన ఇంటిపనులు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. చిరు తన ఇంట్లో హల్ ను శుభ్రపరచడంతో పాటుగా పెసరట్టు ఉప్మా వేసి అయన తల్లి అంజనాదేవి గారికి వడ్డించారు..

అయితే ఈ వీడియోలో చిరు దోశెలు వేసేవిధానం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రొఫెషనల్ వేసినట్టుగా వేసిన చిరు దోస స్టైల్ సూపర్ అంటున్నారు అభిమానులు. ఈమేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరు… భీమ్(తారక్ ను) ఇవి నేను రోజు చేసే పనులే.. ఇవాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ కామెంట్ చేసారు.. ఇదే క్రమంలో అయన సూపర్ స్టార్ రజనీకాంత్, మంత్రి కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరారు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020
మరోవేపు చిరు వీడియోకు ఎన్టీఆర్ స్పందించారు. “సూపర్ సార్ !” అంటూ కామెంట్ చేసారు ఎన్టీఆర్. వీరిద్దరి మధ్య జరిగిన ట్వీట్స్ చూసి అభిమానులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.



































