Sekhar Master: సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మచ్చ సక్సెస్ అందుకోవడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉన్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెరపై కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈయనకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుందని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ తమ్ముడు అకాల మరణం పొందటంతో ఈయన ఎంతో ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఈ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ్ముడి మరణాన్ని శేఖర్ మాస్టర్ తెలియజేస్తూ..
తమ్ముడిని నేను చాలా మిస్ అవుతున్నానని ఎక్కడికి వెళ్లినా తమ్ముడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. తమ్ముడు మా మధ్య లేరు అనే విషయాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.. నువ్వు లేని ఈ లోటు ఎవరు పూడ్చలేరు. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు మిస్ యు రా అంటూ తన తమ్ముడి మరణం గురించి ఈ ఎనర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
మిస్ యు రా…
ఇలా శేఖర్ మాస్టర్ ఇంట్లో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుందని తెలిసిన అభిమానులు కూడా తన తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఢీ డాన్స్ షో కార్యక్రమం తో పాటు స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ కార్యక్రమంలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.































