రాకాసి దోమలు.. దాడి చేశాయంటే ప్రాణాలు పోవాల్సిందే !!

0
193

సాధారణంగా మనుషులకు వచ్చే మెజారిటీ రోగాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దోమలు కారణమవుతూ ఉంటాయి. దోమల వల్లే మనం టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూలాంటి రోగాల బారిన పడుతూ ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేసవి కాలం మినహా మిగతా అన్ని కాలాల్లో దోమలు మనుషులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. అయితే సాధారణ దోమలు కుడితే తాత్కాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ రాకాసి దోమలు కుడితే మాత్రం ప్రాణాలు పోవడం గ్యారంటీ.

ఈ దోమలు మనుషులతో పాటు ఇతర జంతువుల ప్రాణాలను కూడా సులభంగా హరించగలవు. రక్తాన్ని పీల్చి మనుషులను చంపే ఈ దోమలు భూమి మీద ఉన్న మిగతా దోమలతో పోలిస్తే అత్యంత ప్రమాదకరం. అమెరికాలోని లూసియానాలో కొన్ని రోజుల క్రితం రాకాసి దోమలు గుంపులుగా ఏర్పడి జంతువులపై దాడి చేసి జంతువులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాయి. గత నెల 27న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హరికేన్‌ లారా వల్ల భారీ సంఖ్యలో రాకాసి దోమలు లూసియానా ప్రాంతంలోకి వచ్చాయి. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న జింకలు, గుర్రాలు, ఆవులు, గేదెలు, ఇతర జంతువులపై దాడి చేసి అమెరికాకు లక్షల డాలర్లు నష్టం చేశాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉండే అధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేసి రాకాసి దోమల గుంపును తరిమేశారు.

కెమికల్స్ ను పిచికారీ చేయడం వల్ల దోమల ఉధృతి తగ్గినా దాదాపు 400 జంతువులు ఈ రాకాసి దోమల బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఒక వ్యక్తి రాకాసి దోమలకు సంబంధించి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దోమల రక్త పిపాసకు అద్దం పట్టేలా ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here