YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు. అయితే ఎన్నికలలో 151 స్థానాలలో గెలుపు అందుకున్నటువంటి ఈయన ఈసారి అన్ని స్థానాలలో కూడా గెలుపు అందుకోవడం కోసమే కృషి చేస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో ఈయనకు మద్దతుగా తన చెల్లెలు షర్మిల కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈసారి మాత్రం జగన్ కి తన చెల్లెలు వ్యతిరేకంగా మారిపోయారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన అన్న పైనే విమర్శలు చేస్తున్నారు. బహిరంగ సభలలో తన అన్నను అలాగే ఆయన పాలనను ప్రశ్నిస్తున్నారు.
ఇక జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందులలో లేదంటే కడపలో ప్రసంగించిన సభలో మాత్రమే తన చెల్లి గురించి విమర్శిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తన చెల్లెలు గురించి మాట కూడా మాట్లాడటం లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తన చెల్లెలు గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
చెల్లి షర్మిలను మీరు మిస్ అవుతున్నారా అన్న ప్రశ్నకు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కచ్చితంగా తాను మిస్ అవుతున్నానని దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిందని తెలిపారు.. కానీ ప్రేమలు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన చెప్పినట్టు చేస్తుంది. మా కుటుంబానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి చేరింది.
శత్రువులతో చేతులు కలిపింది..
షర్మిల మా కుటుంబ సభ్యురాలు అయి ఉండి కూడా బయటకు వెళ్లి శత్రువులతో చేతులు కలపటం నాకు బాధ కలిగిస్తోంది అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు దూరం అవ్వడం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























