YS Jagan: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి పెద్దలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సభ్యులందరూ కుమ్మక్కయి తనపై యుద్ధానికి దిగుతున్నారని తెలిపారు. అయితే కూటమి సభ్యులు కుట్రలో భాగంగా అధికారులను కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపణలు చేశారు.

ఎన్నికలకు మరొక ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున అధికారులు అందరిని కూడా బదిలీలు చేస్తూ వారికి సానుకూలంగా ఉన్నటువంటి వారిని ఆ స్థానాలలోకి తీసుకురావడం పట్ల జగన్ స్పందించారు. ఇలా అధికారులు అందరిని కూడా స్థాన మార్పిడి చేస్తూ కుట్రలకు తెర లేపుతున్నారని తెలిపారు.
ఇలా కూటమి కుట్రలు చూస్తుంటే ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోందని జగన్ ఆరోపణలు చేశారు.ఏపీలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేయడంతో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా నియమితుడైన విషయం తెలిసిందే. ఇక అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.
ఓటమి భయమే కారణమా..
అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అధికారులందరిని స్థాన మార్పిడీలు చేయడంతో కుట్రకు తెర లేపుతున్నారని, ఓటమి భయం కారణంగానే ఇలా అధికారులను స్థాన మార్పిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారట జగన్ ఆరోపణలు చేశారు.





























