CM KCR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్.ఈయన వెండితెరపై ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగాను అలాగే ఎన్నో అద్భుతమైన సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ రాజకీయాలలో కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ప్రకాష్ రాజ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కళోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. అలాగే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తనకు గంగుల కమలాకర్ అంటే ఎంతో మంచి అభిమానం ఆయన కళాకారులకు ఇచ్చే గౌరవ మర్యాదలు చూస్తుంటే ఆయనపై మరింత గౌరవం పెరిగిందని తెలియజేశారు. ఇక సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.

CM KCR: కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తారు..
ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మనకు దొరకడం నిజంగా మన అదృష్టం కేసిఆర్ మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని, హరితహారం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో కళాకారుల ప్రతిభ కూడా ప్రపంచానికి తెలియజేస్తారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ పై చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



























