AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.





























