హైదరాబాద్ మహానగరానికి మెట్రో సేవలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఉచిత బస్సు సర్వీసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మెట్రో ఆదాయానికి పూర్తిగా గండి పడింది.

ఇదే విషయం గురించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో జరిగిన చిట్ చాట్ లో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉచిత బస్సుల కారణంగా మెట్రో ఆదాయానికి గండి పడుతుందని ఇదిలాగే కొనసాగితే మెట్రో ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో ఆర్ శంకర్‌రామన్ ఇటీవల వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా మెట్రో అమ్ముకుంటే అమ్ముకొనివ్వండి. వారి ఆస్తులను అమ్ముకుంటాము అంటే అడ్డుపడటానికి మనం ఎవరు అంటూ ఈ వ్యాఖ్యలను చాలా తేలిక తీసుకున్నారు. ఇలా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మెట్రో సేవలు ఆగిపోయిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.





























