YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మే 13వ తేదీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే ఫలితాలు మాత్రం జూన్ 4వ తేదీ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాల కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీలో కూటమి ఒకవైపు జగన్ ఒకటే ఒక వైపుగా ఎన్నికలు జరిగాయి.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా దెబ్బ కొట్టాలని కూటమి భావించింది కూటమికి తోడుగా వైఎస్ జగన్ సొంత చెల్లి వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైయస్ జగన్ పై విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా షర్మిల ఏకంగా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగి అవినాష్ రెడ్డికి గట్టి పోటీగా నిలిచారు.
ఇక కడపలో షర్మిల గెలుపు గురించి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల తప్పకుండా గెలుస్తుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు.
షర్మిల గెలుపు ఖాయం..
ఇకపోతే ఆంధ్రాలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న విషయాలపై కూడా ఈయన మాట్లాడారు. ఆంధ్రాలో ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఎలాంటి సంబంధం లేదని,ఎవరు ముఖ్యమంత్రి అయిన వారితో సఖ్యతగా ఉంటామని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.





























