YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జగన్ బొబ్బలి పాకాయిరావుపేట ఏలూరులో పర్యటించారు. అయితే ఈ సభలలో భాగంగా చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మన ఏపీలో అమలులో లేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమలులో ఉందని పేదల భూములను జగన్ లాక్కుంటున్నారని ప్రచారాలు చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి పేదలకు పంచడమే తప్ప చంద్రబాబు లాగా లాక్కోవడం తెలియదని ఈయన విమర్శలు చేశారు. వంద సంవత్సరాల తర్వాత తిరిగి భూములకు రీ సర్వే జరుగుతుంది. భూములను అప్డేట్ చేసే రైతన్నలకు అందిస్తూ ఉంటే చంద్రబాబునాయుడు ఓర్చుకోలేకపోయారని జగన్ మండిపడ్డారు.
బాబును ఓడించడం అంటే పేదలను గెలిపించడమే..
రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ఈ సర్వేలన్నింటినీ చేయించామని వారు ఇకపై కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని తప్పించామని జగన్ తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పేదలు, పేదలు అంటూ ఉంటే పెత్తందారి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి నచ్చడం లేదని విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడును ఓడించడం అంటే పేదలను గెలిపించినట్టే అంటూ ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























