YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీ జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఈ ఎన్నికల ఫలితాలపైనే ఉంది జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అంటూ ఉచిత హామీ పథకాలను అమలులోకి తీసుకు వస్తామని తెలిపారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్ లో ఈ మేనిఫెస్టో విడుదల చేశారు.ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని అన్నారు. గత ఎన్నికలలో విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా నవరత్నాలు 99 శాతం అమలు అయ్యాయని ఈ నవరత్నాల ద్వారా ఎంత మంది ఎన్ని విధాలుగా లబ్ధి పొందారు అనే విషయాలన్నింటినీ జగన్ వివరించారు.
ఇక ఈ మేనిఫెస్టోలో కూడా అవే నవరత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే నవరత్నాలలో భాగంగా ప్రస్తుతం ఇచ్చే నగదును మరింత పెంచుతూ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు పింఛన్లు 3000 నుంచి 3500 వరకు పెంచారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నట్లు తెలిపారు రైతు భరోసాన్ని 16,000 చేశారు. అమ్మఒడి 17 వేలకు పెంచారు. వైయస్సార్ ఈ బీసీ నేస్తం 45000 నుంచి 1.5 లక్షలకు పెంపొందించారు.
నవరత్నాలకే ప్రాధాన్యత..
వైయస్సార్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల వడ్డీ లేని రుణాలు అందించారు వాహన మిత్ర కొనసాగించారు అయితే ఈసారి టిప్పర్ డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తిస్తుందని తెలిపారు. అర్హులై ఇప్పటికీ ఇల్లు పట్టా రానటువంటి వారికి ఇల్లు పట్టాను ఇంటి నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇలా గత ఎన్నికలలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ ఎన్నికలలో కూడా విడుదల చేస్తూ నగదును పెంచుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇలా సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారని చెప్పాలి.





























