ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరాలు, పట్టణాల్లోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచిన జగన్ పట్టణ, నగారాల్లోని పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో సమీక్ష నిర్వహించిన జగన్ ఈ సమావేశంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎటువంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్ ఉన్న ఫ్లాట్లను మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ సర్కార్ లే అవుట్లను అభివృద్ధి చేసి వాటిని ఫ్లాట్లుగా అభివృద్ది చేసిగా మధ్య తరగతి ప్రజలకు ఇవ్వనుంది. గతంలో వైయస్సార్ హయాంలో నగరాల్లో, పట్టణాల్లో రాజీవ్ స్వగృహ పేరుతో ఒక ఒక కార్యక్రమం జరగగా జగన్ సర్కార్ సైతం ఆలాంటి కార్యక్రమాన్నే అమలు చేయడానికి సిద్ధమైంది.
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలాలను కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి భయాందోళన అవసరం లేకుండా తక్కువ ధరకే ఫ్లాట్లు ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. మధ్యతరగతి ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా వ్యవహరించడం వల్ల ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు.
అభివృద్ధి చేసిన ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రభుత్వం గోస్తనీ నదిపై సుందరమైన బ్రిడ్జీని నిర్మించాలని, శాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధి కొత్త విధానాలను పరిశీలించాలని, వైఎస్సార్ జగనన్న కాలనీలలో గ్రౌండ్ డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.