Manchu Family: సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతో మంచి క్రేజ్ ఉంది. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా తన ముగ్గురు పిల్లలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన ఇద్దరు కొడుకులైన మనోజ్ విష్ణు మద్య గొడవలు ఉన్నాయి అంటూ మొదటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.

మనోజ్ రెండో పెళ్లి వేడుకలలో కూడా ఒక గెస్ట్ లాగా వచ్చి వెంటనే వెళ్ళిపోయారు తప్ప బాధ్యతగా ఆ పెళ్లి చేయలేదని తెలుస్తోంది. ఇక మనోజ్ పెళ్లి అయిన వెంటనే వీరిద్దరూ బహిరంగంగా కొట్టుకోవడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఓ సిరీస్ కోసమే ఇలా చేసామంటూ విష్ణు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఇకపోతే తాజాగా మనోజ్ చేసిన ఒక పోస్ట్ కారణంగా వీరిద్దరి మధ్య వివాదాలు ఇంకా తగ్గలేదని ఇప్పటికీ పచ్చిగడ్డి వేసిన ఇద్దరి మధ్య భగ్గుమంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల మనోజ్ కుమార్తె బారసాల వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు.
కూతురి బారసాల…
తనకు అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులు అంటూ తన తల్లిదండ్రులతో పాటు తన అక్కయ్య మంచు లక్ష్మి పేరును ప్రస్తావించారు అలాగే తన అత్తమామలు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి అలాగే అఖిల విఖ్యాతి రెడ్డి పేర్లను కూడా ప్రస్తావించారు కానీ ఎక్కడ కూడా మంచి విష్ణు పేరును ప్రస్తావించకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అందుకే తన అన్నయ్య పేరును మెన్షన్ చేయడానికి కూడా మనోజ్ ఇష్టపడటం లేదని తెలుస్తుంది.































