Colours Swathi: కలర్స్ షో ద్వారా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కలర్స్ స్వాతి అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అవకాశాలను అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించినటువంటి ఈమె హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కలర్స్ స్వాతికి ఉన్నఫలంగా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేకపోవడంతో కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి దూరంగా ఉండడమే కాకుండా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.కలర్స్ స్వాతి హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించే సమయంలో తనతో పాటు తన తల్లి కూడా షూటింగ్ లోకేషన్ కు వెళ్లేవారట.
ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలి అంటే కొన్నిసార్లు మనం రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉండేది అయితే కలర్స్ స్వాతి వెంట ఎప్పుడూ తన తల్లి ఉండడంతో ఆమెకు అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఇబ్బందిగా ఉండేదని అందుకే అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండేవారని తెలుస్తోంది.ఇక ఈమె తల్లి తనని క్షణం పాటు వదలకుండా అంటిపెట్టుకొని ఉండడంతో తను ఇతరులతో కూడా మాట్లాడలేకపోయే వారట.

Colours Swathi: స్వాతి తల్లే కారణమా…
ఇలా ప్రతి విషయంలోను కలర్స్ స్వాతికి తన తల్లి కండిషన్స్ పెట్టడంతో ఆమె తల్లి వ్యవహార శైలి పట్ల విసిగి చెందినటువంటి డైరెక్టర్లు కలర్స్ స్వాతికి అవకాశాలను కూడా ఇవ్వడం లేదు దీంతో ఈమె సినీ అవకాశాలను కోల్పోయిందని తద్వారా తన జీవితమే ఇబ్బందులలో పడిందని తెలుస్తోంది.ఇక ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమై వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.