Colours Swathi: విడాకుల రూమర్లపై పై స్పందించిన కలర్స్ స్వాతి… అన్ని చెబుతానంటూ షాకింగ్ కామెంట్స్!

0
126

Colours Swathi:కలర్స్ స్వాతి పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి స్వాతి పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇందుకు గల కారణం ఈమె కూడా విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమయ్యారన్న వార్తలు రావడమే. కలర్స్ స్వాతి 2018లో వికాస అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో స్థిరపడినటువంటి కలర్స్ స్వాతి సినిమాలకు కూడా దూరమయ్యారు.ప్రస్తుతం ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో ఒక్కసారిగా ఈమె విడాకులు వార్తలు తెరపైకి వచ్చాయి.గతంలో నిహారిక సమంత వంటి సెలబ్రిటీలు కూడా వారి భర్తతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను డిలీట్ చేసి అనంతరం విడాకులను ప్రకటించారు.

ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి కూడా తన భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో ఈమె కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వార్తలపై స్పందించినటువంటి కలర్స్ స్వాతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Colours Swathi: చెప్పాల్సిన సమయం వస్తే చెబుతాను…


ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం మాట్లాడటానికి ఏమీ లేదని ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వచ్చిన చెప్పాల్సి వచ్చిన అన్ని విషయాలు తానే అందరికీ చెబుతాను అంటూ ఈ సందర్భంగా కలర్ స్వాతి కామెంట్స్ చేయడంతో బహుశా ఈమె విడాకులకు అప్లై చేశారని విడాకులు రాగానే ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తారేమో అంటూ పలువురు ఈ కామెంట్ల పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.