టాలెంట్ ఎవరి సొత్తు కాదు. కానీ సినీ పరిశ్రమలో అలా ఉండదు. టాలెంట్ ఉండాలి.. దీంతో పాటే ఎంతో కొంత పలుకుబడి కూడా ఉండాలి. సినీ పరిశ్రమలో ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో అవమానాలు.. ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సి ఉంటుందని కమెడియన్ అలీ అన్నారు. ఎన్నో రోజులు పస్తులు కూడా ఉండాల్సి ఉంటుందన్నారు.

అయినా సినిమా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదని అన్నారు. అయితే ఇక్కడ మొదటి నుంచి కష్టపడి ఎదిగిన వారు నలిగిపోయినవాళ్ళే అని అన్నారు. అందులో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మరింత ఘోరమైన అవమానాలను ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారని ఇటీవల ఓ షోలో పాల్గొన్న అలీ చెప్పుకొచ్చాడు. అలీ మోహన్ బాబుకు జరిగిన అనుభవాన్ని వివరించి కంటతడి పెట్టించారు.
జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్’ అనే షోకి అలీ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజా ప్రోమో ఒకటి విడుదల అయింది. మంచు లక్ష్మీ ఆ ఎపిసోడ్ కు అతిథిగా విచ్చేసారు. అక్కడ జరిగిన ఓ స్కిట్ లో భాగంగా ఆర్టిస్ట్ లకి, స్టేజ్ ఆర్టిస్ట్‌లకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు అలీ.
మోహన్ బాబుకు అప్పట్లో ఆయన మూడు, నాలుగు నెలలుగా ఇంటి రెంట్ కట్టడం లేదు, ఖాళీ చేయడం లేదు.. అని భావించి ఆ ఇంటి ఓనర్.. తినే ప్లేట్‌లో మలానికి వెళ్ళాడు అని అలీ చెబుతుండగా.. అదరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతీ యాక్టర్ ఎదగడం అంత ఈసీ కాదంటూ.. దాని వెనుకు ఎన్నో కష్టాలు ఉంటాయని అలీ చెప్పుకొచ్చాడు. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.































