Avinash: బుల్లితెరపై శేఖర్ మాస్టర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక వెండితెరపై ఈయనకి కొరియోగ్రాఫర్ గా ఉన్న డిమాండ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పటికే స్టార్ హీరోలందరికీ అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఈయన వేసే స్టెప్పులు ఐకానిక్ స్టెప్పులుగా మారిపోతూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలోని ఏక్ బార్ ఏక్ బార్ స్టెప్పులు ఒక రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఈ స్టెప్పులు ఏదో ఒక సందర్భంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ స్టెప్పులు పై ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్ పై పంచులు వేస్తూ అతని పరువు మొత్తం తీశారు.ప్రతి ఆదివారం స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేత గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్‌గా, యష్ మాస్టర్ నటించాడు. ఇక అవినాష్ లేడీ గెటప్పుతో దుమ్ములేపేశాడు.
ఏ టైంలో ఈ స్టెప్స్ కంపోజ్ చేశారో కానీ…
శేఖర్ మాస్టర్ అభిమానిగా ముక్కు అవినాష్ నటిస్తూ ఆయన స్టెప్పులు వేసిన ఏక్ బార్ ఏక్ బార్ అంటూ డాన్స్ మూమెంట్ ను అవినాష్ చేశారు.ఈ క్రమంలోనే ఫ్లోర్ మూమెంట్ వేస్తూ ఏ టైం లో ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారో గానీ అంటూ శేఖర్ మాస్టర్ ని ముక్కు అవినాష్ అనడంతో వెంటనే శేఖర్ మాస్టర్
ఏం టైంలో కంపోజ్ ఏంట్రా అని శేఖర్ మాస్టర్ పగలబడి నవ్వారు. ఈ విధంగా ముక్కు అవినాష్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై పంచులు వేస్తూ అందరిని నవ్విస్తున్నారు.



























