Comedian AVS son Pradeep : బాపు గారి సినిమా ‘మిస్టర్ పెళ్ళాం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనతి కాలంలోనే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఆయన పూర్తి పేరుతో తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టరు, ఏవిఎస్ అనగానే ఆయనను గుర్తుపడతారు. ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించిన ఏవిఎస్ గారు అనారోగ్యంతో 2013 లో మరణించారు. అయితే ఆయన తనయుడు ప్రదీప్ తాజాగా సినిమాల మీద మక్కువతో ఆయన సొంతంగా సినిమా నిర్మాణం చేపడుతూ డైరెక్షన్ చేసిన సినిమా ‘భళా చోర భళా’. ఈ సినిమా లో బడ్జెట్ లో తీసినా ఎవరికీ పెద్దగా రీచ్ అవ్వక లాభాలు రాబట్టలేకపోయినా నష్టాలను మిగల్చలేదు. ఇక సినిమాల గురించి, తన తండ్రి గురించి ప్రదీప్ గారు రిసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం…
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆర్టిస్ట్ జ్యోతి ఏవిఎస్ గారి గురించి మాట్లాడుతూ ఆయన వేసే కుళ్ళుజోకులకు నవ్వలేదని నాకు నటన రాదు అంటూ తన గ్రూప్ లోనుండి తీసేసారు అమెరికా టానా సభలలో అంటూ మాట్లాడిన విషయం గురించి ఇంటర్వ్యూలో ప్రదీప్ ను స్పందన అడుగగా చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా ఎందుకు మాట్లాడటం. వాళ్ళు ఎలాగూ తిరిగి వచ్చి సమాధానం చెప్పలేరు కాబట్టి అలా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు.

ఇటీవల చూసాను ఎమ్ ఎస్ నారాయణ గురించి కూడా ఇలానే డైరెక్టర్ సాగర్ మాట్లాడారు. వాళ్ళు చెబుతున్నవి నిజాలో కాదో చెప్పడానికి వాళ్ళు ఆరోపణలు చేసిన వ్యక్తి లేడు కాబట్టి మాట్లాడుతారా. ఎవరు ఎలా మాట్లాడినా ఏవిఎస్, ఎమ్ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్లంతా కామెడీ చేయడంలో గొప్ప ఆర్టిస్టులు, లెజెండ్స్ అంతే వాళ్లను కించపరచకండి అంటూ ప్రదీప్ అభిప్రాయపడ్డారు.
































