Comedian Ganapathi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని తమ కామెడీ పంచలతో అందరిని పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇలా హైపర్ ఆది టీంలో కమెడియన్ గణపతి అందరికీ ఎంతో సుపరిచితమే. ఇలా కమెడియన్ పాత్రలలో లేడీ గెటప్ పాత్రలు వేస్తూ ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ గణపతి ఒక్కసారిగా బడిపంతులుగా మారిపోయారు.

ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించిన ఈయన ప్రస్తుతం పిల్లలకు పాఠాలు బోధించే టీచర్గా స్థిరపడ్డారు. కమెడియన్ టీచరుగా స్థిరపడేటమేంటి ఇది ఏదైనా స్కిట్ లో భాగము అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈయన నిజ జీవితంలో గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం పొంది ప్రస్తుతం టీచర్గా స్థిరపడ్డారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన గణపతి అదే మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఉన్నఫలంగా ఈయన టీచర్ గా మారడానికి గల కారణం ఏంటి అనే విషయానికొస్తే 1998 డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటినుంచో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే..

Comedian Ganapathi: 25 ఏళ్ల కల…
ఈ క్రమంలోనే ఆ ఏడాది డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించిన గణపతికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వడంతో ఈయన శ్రీకాకుళంలోని ఓ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఇలా ఈయనగా ఈ విషయంపై స్పందిస్తూ తనకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడం 25 సంవత్సరాల కల అని అయితే ఆకల ఇప్పటికి నెరవేరిందని ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాను కమెడియన్ గా రాకముందు పలు ప్రైవేట్ పాఠశాలలలో కూడా టీచర్గా పని చేశానని గణపతి వెల్లడించారు































