Comedian Harsha: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా సాధారణ వారు కూడా ఇటీవల కాలంలో పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా వరుసగా ఇండస్ట్రీలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన నటుడు వైవా హర్ష సైతం తన భార్య అక్షరకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా హర్ష దంపతులు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇలాంటి అనుమానాలకు దారితీస్తోంది.లైఫ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు, ఎగ్జైట్మెంట్, చికాకు, భయం, థ్రిల్.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. మనం జీవితం అనే రైడ్ ఎంజాయ్ చేయడం తప్ప ఏం చేయాలేం. జీవితంలో దేనిని ఆశించకూడదు. తర్వాత నిరాశ చెందకూడదు. లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే అంటూ పోస్ట్ పెట్టాడు.
నేను హ్యాపీగా ఉన్నా ..
ఇలా ఈయన పోస్ట్ చేయడంతో ఈయన కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు ప్రచారం చేశారు. ఇక ఈ వార్తలపై హర్ష స్పందించారు. తన విడాకుల గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను తన పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.
































