Comedian Satya: నిజంగా టాలెంట్, కష్టపడేతత్వం ఉండాలి కానీ సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుంటుంది. లేకపోతే అదే సినిమా పరిశ్రమలో సాధారణ స్థితిలోనే ఉండిపోతాం. ఎంతోమంది సినిమా రంగంపై మక్కువతో సొంత వాళ్లని వదిలి హైదరాబాద్ కృష్ణానగర్ చేరుతుంటారు.

తమ టాలెంట్ తో దర్శక నిర్మాతలు ఒప్పిస్తే చాలు వారి ఫేట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా … ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్న కమెడియన్ సత్య గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం హీరోల ఫ్రెండ్ గా కమెడియన్గా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వివాహ భోజనంబు సినిమాల్లో హీరోగా పరిచయమయ్యాడు. గద్దలకొండ గణేష్ లో మంచి క్యారెక్టర్ ప్లే చేశారు.

ఇదిలా ఉంటే తన తొలినాళ్ళలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు సత్య. సినిమాల పైన ఇంట్రెస్ట్ తో సొంతూళ్లను వదిలి హైదరాబాద్ వచ్చాడు. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి సినిమాపై మక్కువతో దర్శకుడు కావాలని వచ్చాడు. చివరకు కమెడియన్గా వేషాలు సంపాదించుకుంటున్నాడు. అయితే తొలినాళ్ళలో హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యను… కుటుంబ సభ్యులు మళ్లీ ఇంటికి తీసుకెళ్లారు. కానీ సత్య ఆలోచనలు మారలేదు. దీంతో వాళ్ళ నాన్న చేతికి 10,000 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ పంపించాడు.
జూనియర్ ఆర్టిస్టులు పరిచయమయ్యారని.. ..
అలా హైదరాబాద్ కి వచ్చిన తొలినాళ్లలో జీవితం సాఫీగా సాగిన తర్వాత డబ్బులు అయిపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. పని కోసం నాంపల్లి లో ఆసుపత్రి అద్దాలను తుడిచానని చెప్పుకొచ్చాడు. ఇలా చేస్తే రోజుకు రూ. 200 ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ లు పరిచయం అవడం తో వారితో మాట కలిపా అని .. వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే షూటింగ్ చూడొచ్చని చెప్పారని తెలిపాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళాక 500 రూపాయలు తీసుకొని షూటింగ్ జరుగుతున్న చోటు పంపించారు. ఇదే తన జీవితంలో తొలిసారిగా షూటింగ్ చూడటం అని చెప్పుకొచ్చారు. అక్కడ మరి కొందరు జూనియర్ ఆర్టిస్టులు పరిచయమయ్యారని.. వాళ్లతో కలిసి షూటింగ్లకు వెళ్లానని… అలా ఓ సినిమా షూటింగ్ కి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకరు నా దగ్గరున్న డబ్బులు తీసుకొని పారిపోయారని సత్య తెలిపాడు. దీంతో మూడు రోజుల పాటు మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నానని అన్నాడు సత్య. అలా తన బాధను ఫోన్లో తల్లికి తెలియజేశాడు. తండ్రికి విషయం తెలియడంతో ఆయన వచ్చి తనని ఇంటికి తీసుకెళ్లాలని సత్య చెప్పుకొచ్చారు. వాళ్ల నాన్నకు తెలిసిన స్నేహితులు బంధువుల ద్వారా ‘ద్రోణ’ సినిమా కి దర్శకత్వ విభాగంలో చేరారు. ఇలా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ప్రస్తుతం నటుడిగా అలరిస్తున్నారు సత్య.































