Sudhakar: కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే త్వరలోనే తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న తరుణంలో ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి సుధాకర్ అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యానని వెల్లడించారు.

ఈ విధంగా సుధాకర్ ఇటీవల నాగబాబు కొత్తగా ప్రారంభించిన ఎన్ ఛానల్ కార్యక్రమంలో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మెగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనతో చిరంజీవి గారు చాలా సన్నిహితంగా ఉంటారని తెలిపారు.
ఇక చిరంజీవి ఎలాగైతే ఉంటారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఉంటారని వెల్లడించారు. నన్ను ఎంతో ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారని నా భార్యను వదిన అంటూ ఆప్యాయంగా పవన్ పిలుస్తారని సుధాకర్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంతో ఎత్తుకు ఎదిగారని ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని సుధాకర్ తెలిపారు.
బ్రెయిన్ స్ట్రోక్…
ఇలా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆయన చాలా సంతోషపడ్డారు అంటూ సుధాకర్ తెలపడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన చివరిగా సంక్రాంతి సినిమాలో నటించారని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇండస్ట్రీకి దూరమయ్యానని సుధాకర్ వెల్లడించారు.



























