Sudhakar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కమెడియన్ సుధాకర్ ఒకరు. అయితే ఈయన కమెడియన్ గా రాకముందు ఒక స్టార్ హీరో. తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ కు మించిన క్రేజ్ హీరోగా సుధాకర్ సొంతం చేసుకున్నారు కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈయనని కెరియర్ పట్ల అనిచివేశారు.

ఇలా తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేయడంతో ఈయన తిరిగి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ కమెడియన్ గా స్థిరపడ్డారు. ఇక ఇక్కడ అలీ బ్రహ్మానందం వంటి వారితో పోటీగా కామెడీ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఉన్న ఫలంగా సుధాకర్ ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇప్పుడు మాత్రం ఈయన కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు.
ఇలా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన కొడుకు బెన్నీ గురించి ఆయన ఇండస్ట్రీకి రావడం గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తాజాగా నాగబాబు కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కుమారుడు బెన్నీ సుధాకర్ చివరిగా నటించిన సినిమా అలాగే ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను వెల్లడించారు.
బ్రెయిన్ స్ట్రోక్..
నాన్నగారు చివరిగా నటించిన చిత్రం సంక్రాంతి వెంకటేష్ శ్రీకాంత్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో నాన్న చివరిగా కనిపించారు. ఈ సినిమా తర్వాత నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. అందుకే సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని తెలిపారు. ఇక ఈయన లేని లోటును తన కొడుకు బెన్నీ పూర్తి చేయబోతున్నారని సుధాకర్ తెలిపారు. ఇక బెన్నీ కూడా మాట్లాడుతూ ఇప్పటికీ నాన్నకు సరిగ్గా సరిపోయే పాత్రలు ఏవైనా వస్తే చేయించాలని భావిస్తున్నాను అంటూ వెల్లడించారు.



























