Suhas: సుహాస్ పరిచయం అవసరం లేని పేరు ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు సక్సెస్ హీరోగా ఎదో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఈయన కెరియర్ మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే సిరీస్ లో నటించేవారు అనంతరం సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉండేవారు.

ఇలా సినిమాలలో కమెడియన్ గాను విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పించినటువంటి సుహాస్ నటన నైపుణ్యంతో ఏకంగా హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఈయన హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక త్వరలోనే ప్రసన్న వదనం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో సుహాస్ తన రెమ్యూనరేషన్ పెంచారని వస్తున్నటువంటి వార్తలపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
రోజుకు వంద రూపాయలు..
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అవును నేను ప్రతిరోజు వంద రూపాయలు డబ్బు తీసుకొని ఎంతో కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చాను ఇలా తాను కష్టంతోనే ఎదిగానని తెలిపారు. ఇలా తాను కష్టపడి పని చేస్తున్నాను కనుక డబ్బును కూడా ఎక్కువగా తీసుకుంటున్నానని నేను కూడా బ్రతకాలి కదా అంటూ ఈ సందర్భంగా తాను పెంచాను అని వార్తలపై సుహాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


































