Comedian Venu: ఇటీవల విడుదలైన ‘ బలగం ‘ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సినిమాకు కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన వేణు ఇప్పుడు ‘ బలగం’ సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు హీరోలుగా మారటం, హీరోలు దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు. కానీ ఒక కమెడియన్ దర్శకుడుగా మారి సక్సెస్ అవ్వటం ఇప్పటివరకూ జరగలేదు.

కమెడియన్ గా అందరికీ పరిచయమైన వేణు ఇప్పుడు దర్శకుడిగా మారి హిట్ కొట్టడం మాత్రం నిజంగానే పెద్ద విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు టాలివుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్‌గా సక్సెస్ అయిన కమెడియన్ ఒక్కరు కూడా లేరు. కానీ ఈ రికార్డు ఇప్పుడు కమెడియన్ వేణు బ్రేక్ చేశాడు. వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శలకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు పైసల కూడా బాగానే వస్తున్నాయి.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. అలాగే కమెడియన్ వేణుని కూడా ఈ సందర్భంగా చిరంజీవి ప్రశంసించాడు. సాధారణంగా ఒక కమెడియన్ డైరెక్టర్‌గా మారితే.. అతడి నుంచి కామెడీ కథనే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కమెడియన్ గా ఉన్న వేణు మాత్రం కన్నీరు పెట్టించే కథతో బలగంను ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లా తెరకెక్కించారు . ఇదిలా ఉండగా ఇటీవల వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి అందరితో పంచుకున్నాడు.

Comedian Venu: వేణు సక్సెస్ వెనుక ఇంత కష్టం ఉందా…
ఈ క్రమంలో వేణు మాట్లాడుతూ “నేను 1999లో ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా కష్టపడినా తర్వాత ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. తర్వాత ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను. ఆ తర్వాత కమెడియన్ చిత్రం శ్రీను అన్న దగ్గర టచప్ బాయ్‌గా చేరాను. ఇక అప్పటినుండి సినిమాలలో కమెడియన్ గా నటించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వేణు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.





























