Comedian Venu: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎందరో స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఇందులో సందడి చేసినటువంటి వారిలో వేణు ఒకరు. వేణు టీం లీడర్ గా అద్భుతమైన స్కిట్ ఫర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వేణు ఉన్న ఫలంగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు..

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వేణు బయటకు రావడంతో మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే ఈయన కూడా బయటకు వచ్చారని అందరూ భావించారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వేణు పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించలేదు. అయితే ఈయన దర్శకుడిగా మారి తాజాగా బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రావడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తనకు మల్లెమాల వారితో ఎలాంటి మనస్పర్ధలు రాలేదని మనస్పర్ధలు కారణంగా బయటికి రాలేదని తెలియజేశారు.

Comedian Venu: సినిమాలపై పిచ్చే కారణం…
సినిమాలపై ఉన్న పిచ్చే తనని జబర్దస్త్ నుంచి బయటకు నడిపించిందని తెలిపారు.ఎలాగైనా సినిమా అవకాశాలను అందుకొని సినిమాలతో బిజీగా ఉండాలన్నదే తన కసి అని తెలిపారు.అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సినిమా వేటలో పడ్డానని జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు పేరు డబ్బు వస్తున్న కూడా వదిలేసి బయటకు వచ్చానని, ,అంతకుమించి తాను జబర్దస్త్ వదిలి రావడానికి మరే కారణాలు లేవంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

































