Pushpa – Venumadhav: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలోని డైలాగులు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ వైరల్ గా మారింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. “నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పేముంది… పక్కోడి కాలు మీద కాలు వేయలేదు కదా అని చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ డైలాగ్ ను సుకుమార్ తన అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని తెలిపారు.

కానీ ఈ డైలాగ్ కు సంబంధించిన ఓ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ డైలాగ్ గురించి ఐదు సంవత్సరాల క్రితమే వేణుమాధవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వేణుమాధవ్ మాట్లాడుతూ ఒక హీరో తనని కాలుపై కాలు వేసే అలవాటు ఉందా అని అడిగారని చెప్పారు.
రియల్ డైలాగును రీల్ డైలాగ్ గా వాడిన సుకుమార్..
ఇలా హీరో అడగడంతో అవును నా కాలు పై నా కాలు వేసుకుంటే తప్పేముంది… ఇతరులపై వేస్తే తప్పు కాని అని అన్నాను. ఇలా చెప్పే సరికి ఆ హీరో రెండు నిమిషాల పాటు షాక్ అయ్యారు.అలా తప్పు కదా అయ్యా అని అనడంతో తప్పేముంది సార్ నా కాలు పై నేను వేసుకుంటున్నాను అని చెప్పగా అతను సరే కానీ మీ ఇష్టం అంటూ వెళ్లిపోయారు. అయితే ఈ డైలాగ్ గురించి సుకుమార్ కు తెలియదని చెప్పలేము కానీ కొంతమంది మాత్రం వేణుమాధవ్ రియల్ డైలాగును సుకుమార్ రీల్ డైలాగ్స్ కోసం ఉపయోగించారని కామెంట్లు చేస్తున్నారు.
































