సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా మెగా డాటర్ నిహారిక కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. పలు కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసిన నిహారిక మంచి క్రేజ్ సంపాదించుకుంది. అదే విధంగా నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా నిహారికకు గత ఏడాది డిసెంబర్ లో గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు.. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో వివాహం జరిగిన సంగతి మనకు తెలిసిందే. రాజస్థాన్ ఉదయపూర్ కోటలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తరువాత నిహారిక తన భర్తతో కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. పెళ్లి తర్వాత మాల్దీవులు, పాండిచ్చేరి వెళ్లిన ఈ జంట అందుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నిహారిక వివాహం తర్వాత తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి నిహారిక ఇంటిలో పెద్ద గొడవ జరిగిందని, నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ చేయడంతో విసిగిపోయిన అపార్ట్మెంట్ వాసులు తన భర్త పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు వారు నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిహారిక భర్త చైతన్య కూడా అపార్ట్మెంట్ వాసులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇంతకీ అర్ధరాత్రి సమయంలో వీరు గొడవ పడటానికి కారణం ఏంటని విషయానికి చైతన్య ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని అందులో ఆఫీస్ పెట్టాలనే ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి చైతన్య ఫ్లాట్ లోకి పలువురు కుర్రాళ్ళు వస్తూ.. మద్యం సేవించి నానా హంగామా చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి రావడంతో అపార్ట్మెంట్ వాసులపై చైతన్య ఫిర్యాదు చేశారు.తన ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తన ఫ్లాట్ లో ఉన్నటువంటి సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదించినట్లు తెలిపారు.
































