Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఒకప్పుడు కేవలం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండే ఈయన ఇటీవల కాలంలో సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.

ఇప్పటివరకు వేణు స్వామి చెప్పిన జాతకాలు దాదాపు నిజమయ్యాయి. కానీ ఇటీవల వరుసగా ఈయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పిన వేణు స్వామి జాతకం నిజం కాకపోవడంతో ఎంతో మంది ఈయనపై విమర్శలు చేశారు.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు కావడంతో వేణు స్వామి ఈ విషయంపై స్పందిస్తూ తాను చెప్పిన జాతకం తప్పయింది నేను ఒప్పుకుంటున్నాను ఇకపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను ఇలా బహిరంగంగా చెప్పనంటూ ఒక వీడియోని విడుదల చేశారు.
ఇలా వీడియో విడుదల చేసినప్పటికీ ఈయనపై ట్రోల్స్ ఏమాత్రం ఆగడం లేదు అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై వేణు స్వామి స్పందించారు. నేను తప్పును ఒప్పుకున్నా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ కారణంగా నేను భయపడనని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన నాకు ట్రోల్స్ పెద్ద సమస్య కాదని తెలిపారు. అయినా మీ ట్రోల్స్ కారణంగా నేను చాలా బిజీగా మారిపోయాను. ఎక్కువ పని కలుగుతుంది.
తప్పు ఒప్పుకున్నా…
ఇలా నాపై ట్రోల్స్ చేసేవారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించే వారందరూ కూడా మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి ట్రోలర్స్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























