లెజండరీ దర్శకుడు.. 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో విడుదైనల చిత్రం పెళ్లిసందD. ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. దీనిలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించగా.. శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అయింది.

ఇందులో హీరోయిన్ గా చేసిన శ్రీలీల తెలుగులో మంచి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా గలగలా మాట్లాడుతూ చిరంజీవితో పాటు ప్రేక్షకులని కూడా మెప్పించింది. అయితే ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు శ్రీలీలా తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు.
ఈ విషయమై అతడు మీడియా ముందు మాట్లాడారు. శ్రీలీలా తన కూతురు కాదని.. నా మాజీ భార్య కూతరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. తన ఆస్తిని క్లయిమ్ చేసుకోవడానికే తన పేరును వాడుతున్నారని అతడు చెప్పాడు.
ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేశాను అని వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. ఈ వివాదంపై ఇప్పటివరకు శ్రీలీల, ఆమె తల్లి మాత్రం స్పందించలేదు.































