Controversy on Virat fielding : టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా బాంగ్లాదేశ్ క్రికెట్ టీం తో ఇండియా మ్యాచ్ నవంబర్ 3 న ఆస్ట్రేలియా లోని ఆడిలైడ్ వేదికగా జరిగింది. మ్యాచ్ వర్షం కారణంగా చివర్లో ఆడలేక పోవడంతో బంగ్లాదేశ్ పై ఐదు పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ మీద ఒక వివాదం రాజుకుంది. విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ఫేక్ ఫీల్డింగ్ చేసాడు అని బంగ్లాదేశ్ ఆటగాడు నూరుల్ హసన్ ఈ ఆరోపణలను చేశారు. ఒకవేళ ఆ సమయంలో అంపైర్ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది అంటూ ఆరోపించారు.

అసలేంటి ఫేక్ ఫీల్డింగ్…
అసలు వివాదం ఎక్కడా వచ్చిందంటే ఏడవ ఓవర్ లో బంగ్లాదేశ్ ఓపెనర్ లీటన్ దాస్ మొదటి బంతిని డీప్ బ్యాక్ స్క్వేర్ లెగ్ దిశలో ఆడాడు. అయితే వికెట్ కీపర్ ఎండ్ లో అర్షదీప్ బంతిని విసిరాడు. అయితే మధ్యలో కోహ్లీ తన చేతిలోని బంతిని నాన్ స్ట్రైక్ వైపు విసిరినట్లుగా కనిపించాడు. విరాట్ ఇలా చేస్తున్నా అంపైర్ దానిని పట్టించుకోలేదు. అంపైర్ ముందు విరాట్ ఇలా చేసినా అంపైర్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అంపైర్ అపుడు నకిలీ ఫీల్డింగ్ అని పెనాల్టీ విధించే అవకాశం ఉన్నా అలా చేయలేదు.

ఫేక్ ఫీల్డింగ్ అంటే ఫీల్డింగ్ చేస్తున్న టీం లోని సభ్యులు బంతి చేతిలో లేకపోయినా ఉన్నట్లు ప్రవర్తించి బ్యాట్స్మన్ ను కన్ఫ్యూస్ చేయడం. నిజానికి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏం చేయాలో ఐసిసి రూల్స్ లో ఉంది. ఐసిసి తన కొత్త రూల్స్ ఐసీసీ చట్టం 42 ప్రకారం ఫీల్డ్ అంపైర్ లు ఇలా ఫేక్ ఫీల్డింగ్ పాల్పడిన టీం పై పెనాల్టీ విధించే అధికారం, అవకాశం ఉందని చెబుతుంది. అలా పెనాల్టీ విధిస్తే ఫీల్డింగ్ చేస్తున్న టీం పరుగుల నుండి ఐదు పరుగులు తొలగించి బ్యాటింగ్ టీం కి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ సమయంలో నేల తడిగా ఉంది. దాని ప్రభావం అందరికీ కనిపించింది. ఆ త్రో నకిలీదని నేను అనుకున్నాను. జరిమానా విధించి ఉంటే మ్యాచ్ మాకు అనుకూలంగా ఉండేదేమో కానీ అలా జరగలేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ విరాట్ చేసింది ఫేక్ ఫీల్డింగ్ అని అప్పుడే చెప్పుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదంటూ బాంగ్లాదేశ్ ఆటగాడు నూర్ అహమ్మద్ అభిప్రాయపడ్డారు.






























