ప్రస్తుతమున్న పరిస్థితులలో కరోనా వైరస్ బారిన పడితే కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా కరోనా రోగులను మూడు రకాలుగా విభజిస్తారు. స్వల్ప లక్షణాలు, మధ్యస్థ లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిగా కరోనా రోగులను విభజిస్తారు.అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ ఒకే రకమైన మందులను ఉపయోగించి వైద్యం చేయరు.వారిలో వ్యాధి లక్షణాలు వ్యాధి తీవ్రతను బట్టి వారికి చికిత్స అందించడం జరుగుతుంది.

కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటే వారు ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉంటూ తరుచూ ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఏదైనా అవసరమైతే ఆన్లైన్ విధానం ద్వారా వైద్యుల సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మల్టీవిటమిన్ మాత్రలను వేసుకోవడం ద్వారా వ్యాధిలక్షణాలు పూర్తిగా తొలగిపోతాయి.

కరోనా లక్షణాలు కొంతవరకు మధ్యస్తంగా ఉంటే అటువంటి వారు, ఆక్సిజన్ 90 నుంచి 94 మధ్య,
సీటీ స్కాన్‌ స్కోరింగ్‌ 10-20 మధ్య ఉన్నవారు, నడిచినా ఆయాసం ఉన్నవారిని మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి భావిస్తారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరాలి. వీరికి అవసరమైతే ఆక్సిజన్ అందిస్తూ రక్తాన్ని పలుచగా చేసే మందులను ఇస్తారు. అవసరమైతే వీరికి రెమ్‌డిసివిర్‌ ఇస్తారు.

మూడవ వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా ఈ తరహా లక్షణాలు ఉన్నవారికి వెంటిలేటర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. పై తెలిపిన మందులతోపాటు వీరికి ఇమ్యునో మాడ్యులేటర్స్‌ మందులు కూడా ఇస్తాం. కొన్ని ప్రత్యేక కేసుల్లో తొసిలిజుమాబ్, ఇటోలిజుమాబ్‌ ఇస్తాము. అవసరమైతే సైటో సార్బ్‌ డయాలసిస్‌ చేస్తారు. ఈ విధంగా పరిస్థితులను బట్టి రోగికి ఉన్న వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి వారికి మందులను ఇస్తూ వైద్యం చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here