మరో తమిళ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్.. పెరుగుతున్న కేసులు..ఆందోళనలో ప్రజలు!

0
368

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అంతా సంతోషపడుతున్న సమయంలో ఒమిక్రాన్‌ మళ్లీ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ , యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

వాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

అయితే కరోనా పరీక్షలు చేయించకున్న వారికి ఒక వేళ పాటిజివ్ వస్తే.. దానిని టెస్టుల కొరకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ లాంటివి ఏమైనా సోకిందా అనే కోణంలో పరీక్షించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుకు పంపిస్తున్నారు. అయితే విక్రమ్ కు సోకిందా కరోనా.. ఒమిక్రాన్ అనేది వైద్యులు నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విక్రమ్‌ మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

అతడి రిపోర్టును కూడా జీనోమ్ కు పంపించనట్లు తెలుస్తోంది. ఇక హీరో విక్రమ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఈ మమమ్మార కేసులు మళ్లీ పెరుగుతుండటం.. సినీ ప్రముఖులకు వదలకపోవడంతో సినీ వర్గాలు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.