ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర సమయంలో కేవలం ఒక చిన్న పొరపాటు వల్ల ఎంతో మంది బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ఎంతోమంది నష్ట పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తికి ఎదురయింది. కేవలం అతను చేసిన ఒక పొరపాటు వల్ల ఏకంగా 18 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

శ్రీనగర్ కాలనీలో ఉంటున్న ఓ మార్కెటింగ్ మేనేజర్ ఆమధ్య ఆఫీస్ పనిపై బయటకు వెళ్లాడు. వెళ్తూ KBR పార్క్ దగ్గర ఆగాడు. పార్కు దగ్గర ఆగిన మేనేజర్ కి సిగరెట్ తాగాలనిపించింది. అయితే అతని దగ్గర మ్యాచ్ బాక్స్ లేకపోవడంతో సైలెంట్ అయ్యాడు.కానీ అతనికి కొద్దిగా దూరంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించడంతో అతని దగ్గరకు వెళ్లి ఒకసారి మీ సిగరెట్ ఇస్తారా… నా సిగరెట్ అంటించుకుని ఇస్తానని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి సిగరెట్ ఇవ్వడంతో మేనేజర్ సిగరెట్ అంటించుకుని దానిని కాల్చి తన పని నిమిత్తం తను వెళ్ళిపోయాడు.
మూడు రోజుల తర్వాత మేనేజర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కాలు ఒక్క అడుగు ముందుకు వేయలేక పోయాడు.దీంతో అతని కుటుంబ సభ్యులు అతనికి సిటి స్కాన్ చేయించడంతో అతడు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. మార్కెటింగ్ టీమ్ హెడ్ అయిన అతను ఈ విషయం తన టీమ్ సభ్యులకు తెలియజేశారు. అయితే వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మేనేజర్ వల్లనే తమకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని టీమ్ సభ్యులు హెచ్ఆర్ ముందు ఫిర్యాదు చేశారు. అయితే మేనేజర్ వారం క్రితం నుంచి ఎవరిని కలిశాడని ఆరా తీయగా అతడు ఒక వ్యక్తి నుంచి సిగరెట్ తీసుకొని తన సిగరెట్ అంటించుకున్న విషయాన్ని గుర్తించి అతని వల్లే తనకు కరోనా సోకిందని భావించాడు. కేవలం ఒక చిన్న పొరపాటు వల్ల ఇంత మంది బలి అయ్యారు. ఈ 18 మంది మరెంత మందికి కరోనా అంటించారనే ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం అని చెప్పినప్పటికీ ఈ విధంగా కొందరు వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.































