Costume Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా మరణించడంతో ఒక్కసారిగాచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఇలా ఒక నటుడు మరణం మరవక ముందే మరొకరు మరణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు.

ఇండస్ట్రీలోకి కాస్ట్యూమర్ గా అడుగుపెట్టి అనంతరం నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన కాస్ట్యూమ్స్ కృష్ణ నేడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఈయన ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో చెన్నైలోనే ఆయన స్వగృహానికి వెళ్లారు. అయితే అక్కడే ఉన్నటువంటి కాస్టమ్స్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో ఆయన స్వగృహంలోనే మరణించారు. చెన్నైలో కాస్ట్యూమర్ గా పని చేస్తున్నటువంటి ఈయనకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాలో నటుడిగా అవకాశం అందుకున్నారు.

Costume Krishna: స్వగృహంలోనే మరణించిన కృష్ణ…
ఇలా ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో కన్నింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కాస్ట్యూమ్ కృష్ణ మరణం వార్త ఒక్కసారిగా అందరిని కలిసి వేసింది. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో చిత్ర పరిశ్రమ ఈయన మృతికి సంతాపం ప్రకటించింది.ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తెలుగులో ఏకంగా ఎనిమిది సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు.































