YS Jagan: మరి కొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలై ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలియనున్నాయి. మే 13వ తేదీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు నేడు రాబోతున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఈ ఫలితాలపైనే ఉంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న విషయంపై చాలా సందిగ్ధత నెలకొంది.

తామే అధికారంలోకి రాబోతున్నామని కూటమి, లేదు తామే అధికారంలోకి రాబోతున్నామని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. జరగబోతున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ… ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ జగన్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.
అఖండ విజయం…
జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈయన 175 స్థానాలను టార్గెట్ చేశారు. ఎన్నికలలో మనం 175 స్థానాలలో గెలవబోతున్నామంటూ ధీమా వ్యక్తులు చేశారు అయితే ఇప్పటికి కూడా జగన్ అదే ధీమాతో ఉన్నారని 2019 ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నామని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.





























