ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా బతకాలని భావిస్తారు. మంచి ఇల్లు, కారు ఉండాలని భావిస్తారు. ఇలాంటి విలాసవంతమైన జీవితం కొనసాగించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఎంతో కష్ట పడుతూ వారి కలలను సహకారం చేసుకుంటారు. కానీ తమ విలాసవంతమైన జీవితం కోసం ఈ తల్లిదండ్రులు చేసిన పని తెలిస్తే మాత్రం ఎంతో షాక్ అవుతారు.

సాధారణంగా తమ బిడ్డ పట్ల తల్లిదండ్రులు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితం కోసం ఆ దంపతులు తన బిడ్డ పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది.
కన్నౌజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సెకండ్ హ్యాండ్ కార్ కొనడం కోసం ఆ దంపతులు తమ మూడు నెలల చిన్నారిని 1.5 లక్షల రూపాయలకు ఒక వ్యాపారస్తుడుకి అమ్ముకున్నట్లు చిన్నారి అమ్మమ్మ తాతయ్యలు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.
ఈ విధంగా కారు కోసం తన మూడు నెలల మగబిడ్డను తల్లిదండ్రులు అనుకున్నట్లు గురువారం చిన్నారి అమ్మమ్మ తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, తమ విచారణలో భాగంగా ఇప్పటి వరకు చిన్నారి వ్యాపారస్తుడు దగ్గరే ఉన్నాడని, ఈ విషయం గురించి శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులను విచారిస్తామని ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.



























