ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురి చేస్తున్న అతి పెద్ద సమస్య కరోనా. చాలామంది కరోనా బారిన భయపడతామేమోనని ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ విధమైనటువంటి భయాన్ని కలిగిన వారు వారికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మన ఆహారంలో ముఖ్యంగా పెద్దఎత్తున మార్పులు చేసుకోవాలి. సరైన ఆహార నియమాలను పాటిస్తే కరోనా మన దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా విటమిన్ సి, జింక్ తప్పకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ ఆహారపదార్థాలు కోవిడ్ బారినపడిన వారికి కూడా తప్పకుండా తీసుకోవాలి. అధిక మొత్తంలో నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా మన ఆహార పదార్థాలలో ఒక ఉడికించిన గుడ్డు ఉండేలా చూసుకోవాలి.

కరోనా లక్షణాలతో బాధపడేవారు ఎక్కువగా తాజా కూరగాయలతో తయారుచేసిన కిచిడి తీసుకోవడం వల్ల అధిక పోషకాలు మన శరీరానికి అందుతాయి. మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి. కేవలం నీటిని మాత్రమే కాకుండా ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలను సేవించాలి. ప్రతి రోజు పాలు, పెరుగు వంటి పదార్థాలను అధికంగా తీసుకోవాలి.

కరోనా వస్తుందేమోనని భయపడేవారు ఎలాంటి పరిస్థితులలో కూడా జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం. ఒకవేళ డయాబెటిస్, మధుమేహం, కిడ్నీ సమస్యలతో బాధపడే వారు వైద్యుల సలహా మేరకు డైట్ పాటించడం ఎంతో ముఖ్యం. ఈ విధమైనటువంటి డైట్ ఫాలో అవుతూ కరుణ జాగ్రత్తలను పాటించడం ద్వారా ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here