CPI Narayana: సీపీఐ నారాయణ గత సీజన్లో నుంచి బిగ్ బాస్ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన సీజన్ సిక్స్ గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ మండిపడ్డారు.బిగ్ బాస్ కార్యక్రమం ఒక బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్ చేయడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాగార్జునపై కూడా మండిపడ్డారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి నారాయణ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే తాజాగా మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లంతా వ్యభిచారులే అన్నట్టు ఈయన చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో నల్గొండ జిల్లాలో వ్యభిచారులుగా ఉన్నటువంటి ఓ సాధారణ ఇద్దరూ మహిళలకు గుండు కొట్టించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వాళ్లు వ్యభిచారులు అంటూ గుండు కొట్టించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఎవరు? వీరు వ్యభిచారులని గుండు కొట్టిస్తే మరి వాళ్లకు కూడా గుండు కొట్టించాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను కూడా వ్యభిచారులుగా పోలుస్తూ వారికి గుండు కొట్టించాలని, అలా కాకుండా వారికి క్లాప్స్ కొడుతూ వారిని సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

CPI Narayana: దిగజారిపోయి మాట్లాడుతున్న నారాయణ…
ఈ విధంగా రోజు రోజుకు నారాయణ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చాలా దిగజారి మాట్లాడటంతో ఎంతోమంది నెటిజన్ లు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఇతని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నారాయణ ఈ కార్యక్రమం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు అయితే నారాయణ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న నాగార్జున పరోక్షంగా తనపై కౌంటర్లు వేసిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి పరిణామాలకు దారితీస్తాయో తెలియాల్సి ఉంది.
































