CPI Narayana: ఈ మధ్యకాలంలో సీపీఐ నేత నారాయణ తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదు బ్రోతల్ హౌస్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

ఇదిలా ఉండగా నారాయణ గతంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఘాటుగా విమర్శలు చేశారు. అయితే ఈయన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు అలాగే మెగా బ్రదర్ నాగబాబు తమదైన శైలిలో భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దెబ్బకు దిగివచ్చిన నారాయణ అప్పట్లోనే సోషల్ మీడియా వేదికగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు క్షమాపణలు చెప్పారు.
ఈ క్రమంలోనే మరోసారి ఇదే విషయంపై నారాయణ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు తెలియజేశారు. హర్యానా గవర్నర్ మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరైన విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నారాయణ మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడారు.

CPI Narayana: ఎప్పుడో మర్చిపోయాను..
ఈ సందర్భంగా మీడియా సాక్షిగా రెండు చేతులు జోడించి నారాయణ మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడుతూ ఆరోజు ఏదో మాట్లాడాను అందుకు నన్ను క్షమించండి ఏ విషయాలు మనసులో పెట్టుకోకండి అంటూ క్షమాపణలు తెలియజేశారు. ఇక ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తూ నేను ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను అంటూ చెప్పగా ఆయన ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య పలు రాజకీయ చర్చలు జరిగాయని తెలుస్తోంది.






























