Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలకు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం పూర్తిగా తన దృష్టిని కెరియర్ పైన పెట్టారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒకవైపు నిర్మాతగా కూడా కొనసాగుతూ ఉన్నారు.

ఇలా నటిగా నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిహారిక తన ప్రొడక్షన్లోనే ఈమె ఒక డబ్ల్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అత్యంత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారికకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత తన బావతో కలిసి లవ్ స్టోరీ నడుపుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే నిజ జీవితంలో ఈమె బావతో ప్రేమలో పడిందని అర్థం కాదు ఈమె తన బావ అయినటువంటి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఒకే ప్రేమ కథ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
మెగా హీరోతో రొమాన్స్..
ఇలా ఈమె హీరోయిన్ గా ఇప్పటివరకు మూడు సినిమాలలో నటించారు. అయితే మొదటిసారి మెగా హీరోతో అది కూడా తనకు వరుసకు బావ అయినటువంటి వైష్ణవ్ తో కలిసి ఈమె సినిమా చేయబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.




























