ఈరోజు నంద‌మూరి బాల‌కృష్ణ 61వ పుట్టినరోజు సందర్బంగా పలువు సినీ, రాజ‌కీయ‌ మరియు క్రీడా ప్ర‌ముఖులు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు జన్మదిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేపధ్యంలో బాల‌కృష్ణ పేరుతో ఉన్న #HappyBirthdayNBK యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రేండింగ్ లో ఉంది.

అయితే తాజగా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్.. బాల‌కృష్ణ‌తో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.. ‘బాల‌కృష్ణ సార్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నాను మీ ఎంట‌ర్‌టైనింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు సామాజిక కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్ర‌భావితం చేయాలని కోరుకుంటున్నా’ అంటూ యువ‌రాజ్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here