సాధారణంగా దొంగలు డబ్బులను దొంగతనం చేస్తూ ఉంటారు. లేదా మన ఇంట్లో చిన్న పిల్లలు మనకు తెలియకుండా డబ్బులు తీసుకోవడం సర్వసాధారణంగా మనం చూసే ఉంటాం. కానీ ఒక కాకి డబ్బులు దొంగతనం చేయడం మీరు చూశారా? అదేంటి కాకి డబ్బులు దొంగతనం చేయడమా… వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! ప్రస్తుతం కాకి డబ్బులు దొంగతనం చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇకపోతే జంతువులు పక్షులు చేసే చిలిపి పనులు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విధమైనటువంటి వీడియోలు నెటిజన్ల మనసు దోచాయి. ఈ క్రమంలోనే ఒక కాకి నోటిలో కరెన్సీ నోట్లు పోలిన కాగితాలను పెట్టుకొని ఒక ఇంటి బాల్కనీ నుంచి కిటికీలో లోపలికి వెళ్లి డ్రా బాక్స్ వద్దకు చేరింది.

డ్రా బాక్స్ వద్దకు చేరిన కాకి ఆ డబ్బులను అందులో పెడుతున్నట్లుగా కనిపించింది. తీరా ఆ డ్రా ఓపెన్ చేస్తే అందులో నిజంగానే కరెన్సీ నోట్లు కనిపించాయి.అయితే ఆ కాకి ఎక్కడి నుంచైనా కరెన్సీ నోట్లను దొంగతనం చేస్తుందా లేక ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెడుతుందా అనేది స్పష్టత తెలియలేదు.

కాకి చేస్తున్నటువంటి ఈ చిలిపి దొంగ పనికి సంబంధించిన వీడియోను @GorgeousPlanet_ అనే యూజర్ ఐడీ నుంచి ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ని షేర్ చేయడమే కాకుండా ఆ వీడియోకు Men’s best friend ever.. అనే క్యాప్షన్ కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here