మనం చెప్పుకునే కూరగాయల్లో దోసకాయ కూడా ఒకటి. మన ప్రాచీన కాలం నుంచి దీనిని అంతర పంటగాను.. మరియు ప్రత్యేకంగా పొలంలో కూడా దీనిని పండిస్తున్నారు. ఈ దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పుచ్చకాయలో ఎలా అయితే నీటి శాతం ఎక్కువగా ఉంటుందో.. దోసకాయలో కూడా ఉంటుంది. అధిక నీటి శాతం ఉండటం శరీరానికి మంచిదే.

అయితే దీని ద్వారా దోసకాయ పానీయం ఎలా తయారు చేస్తారు.. దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.. మన దేశీయంగా తయారైనా దోసకాయను కడిగి ముక్కలుగా చేసి.. రాత్రి ఒక గ్లాసులో వేయాలి. అలాచేసిన తర్వాత నీటితో నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం తాగితే శరీరంలోని విష పదార్ధాలు విసర్జింప బడతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎముకలు గట్టిగా తయారు అవుతాయి. గాయాలు ఏర్పడినప్పుడు అక్కడ రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు దోసకాయలో కుకుర్బిటాసిన్స్ అనే కాంపౌండ్స్ మరియు లిగ్నాన్స్ అనే న్యూట్రియెంట్స్ సమూహం కలిగి ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఉప్పుని ఎక్కువగా తీసకుంటే.. అధిక రక్తపోటు సమస్య వేధిస్తుంది. శరీరంలోని అదనపు ఉప్పు అనేది ద్రవాలను కలిగి ఉంటుంది.
తద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దోసకాయలోని పొటాషియం అనేది ఎలెక్ట్రోలైట్ గా పనిచేసి కిడ్నీలలో స్థాయిలను నియంత్రిస్తుంది. మెటబాలిజం మెరుగుపడటంతో పాటు అప్పెటైట్ అనేది నియంత్రించబడుతుంది. మూత్రపిండాల సమస్యలను దోసకాయ నీటితో దూరంగా ఉంచవచ్చు. బీపీ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ఇంకా ఈ దోసకాయ వాటర్ ద్వారా మరెన్నో ప్రాణాంతకమైన వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోవచ్చు.































