Custody Movie: నాగచైతన్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం కస్టడీ.మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీత సారధ్యంలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి కృతి శెట్టి జతకట్టారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చైతన్య ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. గత కొద్దిరోజులుగా మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎంఆర్ కాలేజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన నాగచైతన్య తాజాగా సీఎంఆర్ కాలేజ్ వార్షికోత్సవంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి కస్టడీ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దాదాపు 13 విద్యాసంస్థలకు అధినేతగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.మే 12వ తేదీ కస్టడీ సినిమా విడుదల కాబోతుందని అయితే ఆరోజు విద్యార్థులందరూ కాలేజీకి డుమ్మా కొట్టి సినిమా చూడటానికి వెళ్ళండి అంటూ ఈయన సలహాలు ఇచ్చారు.

Custody Movie: పరీక్షలు ఉన్న వాయిదా వేస్తాం…
ఇలా విద్యార్థులకు సినిమాకు వెళ్ళమని సలహా ఇవ్వడమే కాకుండా ఆరోజు ఏదైనా పరీక్ష ఉంటే వాయిదా వేయిస్తామని వీలైతే సీఎంఆర్ విద్యాసంస్థలకు బంద్ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా మల్లారెడ్డి నాగచైతన్య ముందు విద్యార్థులకు కస్టడీ సినిమా చూడటానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


































